ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు - రాష్ట్రంలో తెరుచుకున్న పాఠశాలలు

దాదాపు ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యావారధి పేరిట నిర్వహిస్తోన్న టీవీ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసం 9,10 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు
రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు

By

Published : Sep 21, 2020, 3:29 PM IST

కరోనా కారణంగా మార్చి చివరిలో మూతపడిన పాఠశాలలు... దాదాపు ఆరు నెలల తర్వాత తెరుచుకున్నాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు జిల్లాల్లో 9, 10తరగతుల విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యావారధి పేరిట నిర్వహిస్తోన్న టీవీ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసమే 9,10 తరగతులకు క్లాసులు నిర్వహిస్తుండటంతో..మిగతా తరగతుల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో బడికి వచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు తల్లిదండ్రుల నుంచి అంగీకారపత్రాన్ని తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు

విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాఠశాలలు చాలారోజుల తర్వాత తెరుచుకోవటం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details