ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

EDUCATION: 'అధికంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు' - ఏపీ న్యూస్ అప్​డేట్స్

సహేతుక కారణాలు వివరించే విద్యాసంస్థలకు ఫీజులు సవరించేందుకు సిద్ధమని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్​ కాంతారావు చెప్పారు. 20 ఏళ్లుగా ఫీజులు ఖరారు చేయలేదన్న ఆయన.. కళాశాలల పరిశీలనకు వెళ్తుంటే కొందరు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. విద్యాసంస్థల్ని లాభదాయకంగా చూడరాదన్నారు.

EDUCATION
EDUCATION

By

Published : Aug 26, 2021, 2:22 PM IST

విద్యాసంస్థల నిర్వహణ అన్నది సామాజిక సేవ అని.. లాభదాయకమైన వ్యాపారం కాదని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు కమిషన్ నిర్ణయించిన ఫీజలు కన్నా అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు నిర్ణయించే ఫీజులతో పోల్చితే ఏపీలో భిన్నంగా ఉన్నాయని కమిషన్ ఛైర్మన్ అన్నారు. ఇప్పటికే కమిషన్ చేసిన ప్రతిపాదనలపై ఫీజలు ఖరాలు చేస్తూ ప్రభుత్వం 53, 54 జోవో ఇచ్చిందని.. ఇది విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు గమనించాలని సూచించారు.

అధిక ఫీజలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే.. తమ కమిషన్ వెబ్​సైట్​లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు, ప్రైవేటు విద్యా సంస్థలకు ఏ ఇబ్బందులు ఉన్నా తమ గ్రీవెన్స్​కు ఫిర్యాదు చేస్తే తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని కమిషన్ సభ్యుడు సాంబశివారెడ్డి తెలిపారు. 80 శాతం ప్రైవేటు యాజమాన్యాలు తాము ఖరారు చేసిన ఫీజులపై ఎటువంటి ఇబ్బందులకు గురికావటం లేదన్నారు. ఆయా పాఠశాలలకు తాము నిర్ణయించిన ఫీజులు సరిపోలేకపోతే.. ఫీజలు పెంచుకునేందుకు దరఖాస్తు చేస్తే పరిశీలించిన నిర్ణయం తీసుుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: Covid: పాఠశాలల్లో కరోనా కలకలం..వైరస్ బారిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

ABOUT THE AUTHOR

...view details