జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదాను కస్తూరి రంగన్ కమిటీ రూపొందించింది. ఈ ముసాయిదాపై... రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ...జ్వోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. విద్యారంగానికి చెందిన నిపుణులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఎన్జీఓ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో ఎటువంటి సంస్కరణలు అవసరం... కస్తూరీ రంగన్ కమిటీ ఇచ్చిన ముసాయిదాలో మంచి చెడులపై విశ్లేషించనున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో కీలక అంశాలపై మేథోమధనం జరపి... సుదీర్ఘంగా చర్చించాలని సభికులను మంత్రి కోరారు.
''కస్తూరి రంగన్ ముసాయిదా అమలుకు ఏం చేద్దాం?'' - education policy summit
జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదాపై రెండు రోజుల సదస్సును విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.
జాతీయ విద్యా విధానం ముసాయిదాపై సదస్సు