ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VIRAL VIDEO:కేసు పెట్టిందని... నడిరోడ్డు మీద మహిళపై దాడి! - Scenes of an attack on a woman gone viral

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై కొంత మంది మహిళలు దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. ఇంటి నిర్మాణం విషయంలో వచ్చిన విభేదాలతో మహిళపై ఈ దాడికి పాల్పడ్డారు.

VIRAL VIDEO:కేసు పెట్టిందని నడిరోడ్డు మీద మహిళపై దాడి
VIRAL VIDEO:కేసు పెట్టిందని నడిరోడ్డు మీద మహిళపై దాడి

By

Published : Jun 12, 2021, 9:59 AM IST

VIRAL VIDEO:కేసు పెట్టిందని నడిరోడ్డు మీద మహిళపై దాడి

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని జేపీ నగర్​లో ఓ మహిళపై కొంతమంది మహిళల దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. జేపీ నగర్​కు చెందిన హనుమంతు, లక్ష్మీ.. తన స్థలంలో ఇంటి నిర్మాణ పనుల ప్రారంభం కోసం మూడు రోజుల కిందట ప్రయత్నం చేశారు. ఆ స్థలం ఆమెది కాదని కొందరు వారించి అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్​లో లక్ష్మీ ఫిర్యాదు చేసింది.

శుక్రవారం ఇంటి నిర్మాణ పనుల కోసం మహిళ అక్కడికి వెళ్లగా.. తమపైనే కేసు పెడతావా అంటూ కొందరు మహిళలు లక్ష్మీపై దాడికి దిగారు. పోలీసులు వారించినా వినకుండా దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా వినకుండా చేతికి దొరికిన దానితో కొట్టారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా​ మారాయి.

ABOUT THE AUTHOR

...view details