వినియోగదారుల సొంతింటి కలను నిజం చేసేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్‌బీఐ విజయవాడ ఏజీఎం వసంతలక్ష్మి తెలిపారు. ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే గృహాలకు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్దేశించిన ప్రకారం రెపో ధరలో మార్పు వచ్చినప్పుడు రుణాలకు వడ్డీ విషయంలోనూ మార్పు ఉంటుందన్నారు. విజయవాడలో నిర్వహించే రెండు రోజుల ప్రాపర్టీ షోను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే నెల నుంచి గృహ రుణాలపై వడ్డీ శాతం తగ్గబోతోందని పేర్కొన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారి పేరిట గృహరుణాలను 8.15 శాతం వడ్డీకి అందిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విజయవాడలో ఎస్‌బీఐ ప్రాపర్టీ షో ! - SBI latest news
ఎస్‌బీఐ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రాపర్టీ షోను ఎస్‌బీఐ నగర ఏజీఎం వసంతలక్ష్మి ప్రారంభించారు. వినియోగదారుల సొంతింటి కల నిజం చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్‌బీఐ ప్రాపర్టీ షో !