Sarpanch Association besieged panchayatraj commissioner office: పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచుల సంఘం ముట్టడించింది. తాడేపల్లిలోని కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్‌ను.. సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు నిర్బంధించారు. పంచాయతీలకు రావల్సిన రూ.7 వేల కోట్ల నిధులను ఇతర పథకాలకు మళ్లించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచుల సంఘం ప్రతినిధుల ఆందోళన.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి - Sarpanch Association representatives at tadepally
![సర్పంచుల సంఘం ప్రతినిధుల ఆందోళన.. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి Sarpanch Association besieged panchayatraj commissioner office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14565089-571-14565089-1645774155083.jpg)
12:30 February 25
అసిస్టెంట్ కమిషనర్‌ను నిర్బంధించిన సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు
సర్పంచులకు తెలియకుండా వారి అకౌంట్ల నుంచి నిధులు మళ్లించడమేంటని నిలదీశారు. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపులు తోసుకుని లోపలికి ప్రవేశించారు. పంచాయతీరాజ్ కమిషనర్ లేకపోవడంతో.. సహాయ కమిషనర్ ను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన కార్యాలయంలోనే సర్పంచులు బైఠాయించారు. ప్రభుత్వం అక్రమంగా మళ్లించకున్న నిధులను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ సంఘం ప్రతినిధులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సర్పంచ్ సంఘం ప్రతినిధులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైకాపా సర్కారుపై సర్పంచుల పోరాటానికి మా మద్దతి ఉంటుంది..
మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తమ హక్కులు హరించి, నిధులు మళ్లించిన వైకాపా సర్కారుపై సర్పంచుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ప్రతినిధుల తరపున పోరాడుతున్న బాబు రాజేంద్రప్రసాద్, సర్పంచ్ సంఘ ప్రతినిధులని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
YS Viveka Case: వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్ మనోహర్‌రెడ్డి చెప్పారు: ప్రతాప్‌రెడ్డి