ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vasantha Panchami:వసంత పంచమి వేళ భక్తులతో సరస్వతి ఆలయాలు కిటకిట - అక్షరాభ్యాసం

Vasantha Panchami: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో చిన్నారుల అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలతో.. తెలంగాణ రాష్ట్రం నిర్మల్​ జిల్లాలోని బాసర, సిద్దిపేట జిల్లాలోని వర్గల్​ దేవాలయాలు కోలాహలంగా మారాయి.

వసంత పంచమి వేళ భక్తులతో సరస్వతి ఆలయాలు కిటకిట
వసంత పంచమి వేళ భక్తులతో సరస్వతి ఆలయాలు కిటకిట

By

Published : Feb 5, 2022, 8:38 AM IST

Vasantha Panchami: వసంత పంచమిని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు బాసరకు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తుల తాకిడితో బాసర క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తజనం క్యూలైన్లలో బారులు దీరారు.

తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం, పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

వర్గల్​కు భక్తుల తాకిడి..

మరోవైపు తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని వర్గల్ సరస్వతి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. విద్యా జ్యోతిగా సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం వేలాదిగా వస్తున్న భక్తుల కోసం.. మూడు మండపాల్లో ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details