'రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని తరిమేసి ఉద్యోగాల కల్పన లేకుండా జగనన్న కొబ్బరి చిప్పల పథకంతో యువతను రోడ్డున పడేశారు' అని తెదేపా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి తనకు నచ్చని పరిశ్రమలపై పీసీబీని, ప్రతిపక్షాలపై జేసీబీని, ఉద్యోగులపై ఏసీబీని ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా సంస్థ చెన్నైకి తరలిపోయేలా చేశారని ప్రసాద్ ఆక్షేపించారు.
రాయలసీమ ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్న సంస్థను వేధించటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అమర్ రాజా సంస్థ తరలింపు వల్ల ఉపాధి కోల్పోయే వారికి 'సాక్షి లేదా భారతి సిమెంట్స్‌లో సజ్జల ఉపాధి కల్పిస్తారా' అని నిలదీశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత రెండేళ్లలో రాష్ట్రం నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని మండిపడ్డారు.