Rush at RTC Bus and Railway stations : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిస్తున్నాయి. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా..ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేశాయి.
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మాస్కు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తోంది. ఆర్టీసీప్రయాణ ప్రాంగణాల్లో మాస్కు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తోంది. సొంతూళ్లకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లలో రద్దీ నెలకొంది. పలు ప్రాంతాలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
చర్యలకు సిద్ధమైన రవాణాశాఖ..
అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై రవాణాశాఖ చర్యలకు సిద్ధమైంది. ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 91542 94722 ఏర్పాటు చేసింది. ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.