ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SANKRANTHI: విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

SANKRANTHI:సంక్రాంతి అంటే అచ్చమైన పల్లె పండుగ. మనవైన సంప్రదాయాలు, సంస్కృతుల్ని ప్రతిబింబించే సప్తవర్ణాల వేడుక. మనుషులు, మూగజీవాల మధ్య ఉండే అనురాగాలు, అనుబంధాలకు ప్రతీక. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించిన ముందస్తు సంబరాలు... విద్యార్థులకు సరికొత్త అనుభూతుల్ని పంచాయి.

విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 9, 2022, 11:36 AM IST

విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

SANKRANTHI:పంట పొలాలు, ఏటిగట్లు, ఆటపాటలు, భోగి మంటలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలకు చిరునామా 'సంక్రాంతి'. తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగను... ఐఐఎం-విశాఖ విద్యార్థులు 'సంప్రదాయ దినోత్సవం' పేరిట ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు, పిండివంటలతో సందడి చేశారు. విశాఖ గ్రీన్ డేల్ పాఠశాల విద్యార్థులు... సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కోలాటం ఆడుతూ, గాలి పటాలు ఎగురవేస్తూ ఆహ్లాదంగా గడిపారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో... ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. చెరుకుగడలు, మామిడి తోరణాలు, పూల దండలతో విద్యార్థులు అందంగా ముస్తాబు చేశారు. భోగి మంటలు వేశారు. బొమ్మల కొలువు నిర్వహించారు. చింతలపూడి ప్రియదర్శిని విద్యాసంస్థల ఆధ్వర్వంలో ముగ్గుల పోటీలు ఏర్పాటుచేశారు. కోలాటం, కోడి పందేలు, బసవన్నల సందడితో పండుగ కళ ఉట్టి పడింది.

కృష్ణా జిల్లా మైలవరం ఎస్ఎస్​కె పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన చిన్నారులు... సంక్రాంతి పాటలకు నృత్యాలు చేసి మెప్పించారు.

ఇదీ చదవండి:

ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు

ABOUT THE AUTHOR

...view details