ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేతనాలు పెంచడంతోపాటు బకాయిలు చెల్లించాలి: కార్మికులు

విజయవాడ బందర్ రోడ్డులోని ఆర్​అండ్​బీ భవనం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచడంతోపాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని నినదాలు చేశారు.

sanitation workers protest at vijayawada
వేతనాలు పెంచడంతోపాటు బకాయిలు చెల్లించాలి

By

Published : Mar 2, 2021, 8:35 PM IST

వేతనాలు పెంచడం సహా బకాయిలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ బందర్ రోడ్డులోని ఆర్​అండ్​బీ భవనం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నామని.. తమను ఆదుకోవాలని కోరారు. బతుకు భారమై ఆందోళనకు దిగామని.. ముఖ్యమంత్రి జగన్ స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

యశ్వంత్ ఫెసిలిటీ సర్వీస్​కు చెందిన కాంట్రాక్టర్ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉపవాసం ఉండాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కేవలం రూ. 6,500 వేతనంతో పనులు చేస్తున్నామని.. ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం సహా పలు కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి.

ఇదీ చూడండి:కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details