ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sangam Diry: సంగం డెయిరీ కేసులో విచారణ వాయిదా - సంగం డెయిరీ కేసు వార్తలు

సంగం డెయిరీ కేసులో ప్రభుత్వ అప్పీల్‌తోపాటు గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్ సంఘం వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

By

Published : Jun 22, 2021, 6:48 AM IST

సంగం డెయిరీ కేసులో హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వ అప్పీల్‌తోపాటు గుంటూరు జిల్లా మిల్క్‌ ప్రొడ్యూసర్స్ సంఘం వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. మీరు షేర్‌హోల్డర్‌ కాదు, సంగం మిల్క్‌ కంపెనీ హోదా పొందిన తర్వాత ఆ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చా అని ఏజీని ప్రశ్నించింది. దీనికి బదులిచ్చిన ఏజీ.. కంపెనీ హోదాకు ఆటకం కలిగే విధంగా వ్యవహరించడం లేదని, ప్రజా ఆస్తుల ప్రయోజనాల్ని కాపాడటం కోసం జీవో ఇచ్చామన్నారు . సంగం తరపున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ... డెయిరీ నిర్వహణ బాధ్యతను పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అప్పగిస్తూ 1978 ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతం ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం 2021 లో జీవో ఇచ్చిందన్నారు . ప్రభుత్వ ఆస్తులు సహకార సంఘంలో లేవన్నారు . కంపెనీ హోదా పొందాక రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు . ఆస్తులేమైనా ప్రభుత్వానివి ఉంటే రాబట్టుకోవడానికి వేరే మార్గాన్ని అనుసరించాలి తప్ప .. కంపెనీని స్వాధీనంలోకి తీసుకుంటూ జీవో ఇవ్వడం తగదన్నారు . ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details