గుత్తేదారులు, నిర్మాణ సంస్థలకు అవసరమైన టోకు (బల్క్ / అధిక పరిమాణం) ఇసుకను వారు కోరిన చోటుకే సరఫరా చేసేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమైంది. టోకున ఇసుక తీసుకొని దానిని ఇతరులకు అధిక ధరలకు విక్రయించడం, లారీల యజమానులు ఎక్కువ రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్న కారణంగా.. వాటిని నియంత్రించేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు. వచ్చే వారమే తాజా నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
బల్క్ ఆర్డర్‌లో తొలుత 50 టన్నులు పంపించి, అది అందినట్లు గుత్తేదారు సంస్థ సమాచారం ఇస్తేనే, మిగిలిన ఇసుకను పంపిస్తారు. ఇంటికే ఇసుక సరఫరా విధానం గత నెల 2న తొలుత కృష్ణా జిల్లాలో ఆరంభించగా, ఇపుడు కర్నూలు, చిత్తూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో క్రమంగా అమల్లోకి తెచ్చారు. సకాలంలో రవాణా ఛార్జీలు చెల్లించడం లేదనే కారణంతో కొన్ని జిల్లాల్లో లారీల యజమానులు వెనకడుగు వేశారు. తాజాగా 24-48 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పగటిపూట సరఫరాకు వినతి