ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులిచింతల నీటి విడుదలే.. ఇసుక లారీలను ముంచేసింది! - చెవిటికల్లు వద్ద కృష్ణా నది

కృష్ణా జిల్లా చెవిటికల్లు (chevitikallu) వద్ద కృష్ణా నదిలో (krishna river) ఇసుక లారీలు, ట్రాక్టర్లు చిక్కుకున్నాయి. పులిచింతల జలాశయం(pulichinthala project) నుంచి నీటి విడుదల, మున్నేరు వాగు(munneru stream) ఉప్పొంగడంతో ఈ ఘటన జరిగిందని నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

కృష్ణా నదిలో చిక్కుకున్న లారీలు
కృష్ణా నదిలో చిక్కుకున్న లారీలు

By

Published : Aug 14, 2021, 4:04 PM IST

పులిచింతల జలాశయం నుంచి 80వేల క్యూసెక్కుల నీరు విడుదల, మున్నేరు వాగు ఉప్పొంగడంతో కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక క్వారీలో వాహనాలు చిక్కుకుపోయాయి. మొత్తం 132లారీలు, మరో నాలుగు ట్రాక్టర్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. క్వారీ వద్ద దాదాపు 3మీటర్ల ఎత్తున వరద నీరు రావడంతో ఇసుక రవాణా కోసం సిద్ధంగా ఉన్న లారీలు, ట్రాక్టర్లు చిక్కుకున్నాయి.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు... లారీ డ్రైవర్లను, సిబ్బందిని పడవల్లో సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ-ఆపరేషన్ కొనసాగింది. మరోవైపు.. పులిచింతల డ్యాం నుంచి నీటి విడుదల సమాచారం తమకు ఏమాత్రం లేదని ఇసుక క్వారీ చేస్తున్న జేసీ వెంచర్స్ ప్రతినిధి శరత్ చంద్ర తెలిపారు. క్వారీలోకి వరద నీరు రావడంతో వెంటనే సిబ్బందిని, లారీ డ్రైవర్లను అప్రమత్తం చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details