రాష్ట్ర నాయకత్వ సుపరిపాలనా సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శి సమీర్ శర్మను.. ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ గవర్నెన్స్ సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ప్రణాళికా విభాగం కార్యదర్శి అదనపు బాధ్యతల్లో పని చేస్తున్న అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కూడా.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Transfer: ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియామకం - ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ బదిలీ వార్తలు
రాష్ట్ర నాయకత్వ సుపరిపాలనా సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శి సమీర్ శర్మను.. ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రణాళికా విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియామకం