Salaries to Volunteers: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలు, వాలంటీర్ల కోసం రూ.768 కోట్లను ఆర్ధిక శాఖ విడుదల చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేతనాల చెల్లింపు కోసం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ద్వారా ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వారి వేతనాల కోసం కొత్త హెడ్స్ కేటాయించాలంటూ ఇటీవల ట్రెజరీస్ డైరెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో వేతన బిల్లుల కోసం కొత్త హెడ్లను కేటాయించటంతో పాటు రూ.768 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటి వరకూ ప్రోబేషన్ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు జీతాలు విడుదల - గ్రామ సచివాలయ సిబ్బందికి జీతాలు విడుదల
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ రూ.768 కోట్లు విడుదల చేసింది. ప్రొబేషన్ వచ్చిన ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందనున్నాయి.
![గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు జీతాలు విడుదల వాలంటీర్లకు జీతాలు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15922386-975-15922386-1658759795396.jpg)
వాలంటీర్లకు జీతాలు విడుదల