ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పాతిక లక్షలతో నలుగురి ప్రాణాలు వెల కడతారా ?' - సలాం ఆత్మహత్య కేసు

అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించిన తీరు భయపెట్టినట్లుగా..,‌ప్రలోభాలకు గురి చేసినట్లుగా ఉందని సలాం న్యాయ పోరాట సమితి కన్వీనర్ ఫారుఖ్ షిబ్లీ విమర్శించారు. ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.

'రూ. 25 లక్షలతో నలుగురి ప్రాణాలు వెల కడతారా ?'
'రూ. 25 లక్షలతో నలుగురి ప్రాణాలు వెల కడతారా ?'

By

Published : Nov 20, 2020, 9:33 PM IST

అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి జగన్ తన వద్దకు పిలిపించుకోవటం ఆయనలోని అహంకారాన్ని, రాచరికపోకడను బయటపెట్టిందని సలాం న్యాయ పోరాట సమితి కన్వీనర్ ఫారుఖ్ షిబ్లీ విమర్శించారు. జగన్ పరామర్శించిన తీరు భయపెట్టినట్లుగా.. ‌ప్రలోభాలకు గురి చేసినట్లుగా ఉందని మండిపడ్డారు. సలాం కుటుంబానికి రూ. 25 లక్షలు, ఔట్ సోర్సింగ్​లో ఉద్యోగమని చేతులు దులుపుకుంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు.

పాతిక లక్షల‌ చెక్కుతో నలుగురి ప్రాణాలకు‌ వెల కడతారా అని షిబ్లీ నిలదీశారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆయన...నిందితులకు‌ బెయిల్‌ వచ్చేలా సెక్షన్​లు పెట్టిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐకి కేసు అప్పగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details