ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 24 వరకు శాకాంబరీ ఉత్సవాలను శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. కనకదుర్గ అమ్మవారిని ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు పూజాదికాలు నిర్వహించారు.
అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలను వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు. దుర్గమ్మ మూలవిరాట్టును విభిన్నమైన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శాకాంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.