Sajjala teleconference with ysrcp leaders : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆదేశించారు.
SAJJALA TELECONFERENCE WITH YSRCP LEADERS : 'ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి' - teleconference with ysrcp leaders
Sajjala teleconference with ysrcp leaders : అన్ని జిల్లాల వైకాపా నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కుపై ప్రతిపక్షాల దుష్ప్రచారం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విస్తృత సమావేశాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల
విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఇది స్వచ్ఛంద పథకం అనే విషయాన్ని తెలియచేయాలని పథకాలను ఆపడం కానీ, బెదిరింపులను కానీ సహించేది లేదని స్పష్టం చేయాలన్నారు. 1983 నుంచి 2011 వరకు రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు మేలు చేసేలా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.
ఇదీచదవండి.