ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు.. జాబితా ప్రకటించట్లేదు: సజ్జల

By

Published : Mar 17, 2021, 7:48 PM IST

ఇవాళ మేయర్, వైస్ ఛైర్మన్‌ అభ్యర్థుల జాబితా ఇవ్వాలని భావించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 70 శాతం స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

sajjala ramakrishnareddy clarity on mayor candidates list
sajjala ramakrishnareddy clarity on mayor candidates list

కొన్ని స్థానాల్లో మేయర్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి కాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎంపిక పూర్తి కానందున అభ్యర్థుల జాబితా ప్రకటించట్లేదని స్పష్టం చేశారు. మైదుకూరు, తాడిపత్రిలో సమంగా నిలిస్తే టాస్ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. ఇతరులను ప్రలోభ పెట్టవద్దని సీఎం ఆదేశించారని సజ్జల వెల్లడించారు. అధికార దుర్వినియోగం చేయవద్దన్నారని పేర్కొన్నారు.

చట్టబద్దంగానే చంద్రబాబుపై దర్యాప్తు

చట్టబద్దంగానే చంద్రబాబుపై దర్యాప్తు జరుగుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కు కక్ష సాధింపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఐడీ ముందు వివరణ ఇస్తారని సజ్జల తెలిపారు.

ఇదీ చదవండి:మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు

ABOUT THE AUTHOR

...view details