సామాజిక పింఛన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పింఛన్లలో పొరపాట్లను సరిచేయడానికే కొత్త విధానం అమలులోకి తీసుకొస్తున్నామన్నారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పింఛన్లు తీసుకుంటున్నారన్నారు. మూడు నెలలకోసారి వస్తే ఒకేసారి పింఛన్లు ఇవ్వరని సజ్జల స్పష్టం చేశారు.
SAJJALA: ఈ నెలాఖరులో లేదా అక్టోబర్‌లో 'సీఎం రచ్చబండ': సజ్జల - రచ్చబండపై సజ్జల కామెంట్స్
![SAJJALA: ఈ నెలాఖరులో లేదా అక్టోబర్‌లో 'సీఎం రచ్చబండ': సజ్జల నెలాఖరు లేదా అక్టోబర్‌లో సీఎం రచ్చబండ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12941210-1083-12941210-1630504113552.jpg)
నెలాఖరు లేదా అక్టోబర్‌లో సీఎం రచ్చబండ
19:04 September 01
నెలాఖరు లేదా అక్టోబర్‌లో సీఎం రచ్చబండ
రెండేళ్లలో ఎక్కడైనా అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయా ? అని ప్రతిపక్షాలను నిలదీశారు. వచ్చే ఎన్నికల నాటికి కచ్ఛితంగా పురోగతి చూపుతామన్నారు. త్వరలో 'రచ్చబండ' కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని..ఈ నెలాఖరు లేదా అక్టోబర్‌లో కార్యక్రమం ఉంటుందన్నారు. వైఎస్‌ఆర్ అభిమానులను విజయమ్మ కలవడంలో తప్పేమీ లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
CM JAGAN: గ్రామ సచివాలయాల్లో 2,038 పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకారం
Last Updated : Sep 1, 2021, 7:52 PM IST