కృష్ణా నదీ జలాలను కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఇది రెండు దేశాల మధ్య సమస్య కాదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ప్రభుత్వానిది కాదు. అలా అని ఒక్క చుక్క నీటినీ వదులుకోవడానికీ ప్రభుత్వం సిద్ధంగా లేదు’ అని పేర్కొన్నారు. నదీ జలాలపై ముఖ్యమంత్రికి స్పష్టమైన వైఖరి ఉందన్నారు.
జల వివాదాలపై(water dispute) రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని సజ్జల స్పష్టం చేశారు. జలవివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు(letters) రాశామని తెలిపారు. జల వివాదంపై కేంద్రం(central govt) కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని అన్నారు.