ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sajjala On Petrol Prices: పెట్రోల్‌ రేట్లను పెంచిన కేంద్రమే తగ్గించాలి..మేం తగ్గించలేం: సజ్జల - పెట్రో ధరలు న్యూస్

పెట్రోల్‌ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వమే వాటి ధరలను తగ్గించాలని..ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొట్టేందుకే...సెస్‌ రూపంలో పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. దీనిపై కావాలనే ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు.

పెట్రోల్‌ రేట్లను పెంచిన కేంద్రమే తగ్గించాలి
పెట్రోల్‌ రేట్లను పెంచిన కేంద్రమే తగ్గించాలి

By

Published : Nov 8, 2021, 9:32 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిపక్షాలు కావాలనే ఆందోళనలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పెట్రోల్‌ రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వమే వాటి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కొవిడ్​తో రాష్ట్రాల పరిస్థితి దారుణంగా తయారైందని.., ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందన ధరలు తగ్గించడం రాష్ట్రాలకు సాధ్యపడదన్నారు. చమురు ధరలు, కరెంటు అంశాలపై తెలుగు దేశం, భాజపా రెండు పార్టీలూ వివాదాలు సృష్టిస్తున్నాయన్నారు. అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకపోయినా...కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు.

అంతర్జాతీయంగా ఉన్న ధరల ప్రకారమైతే..లీటర్ రూ. 70 లోపే ఇంధనం లభించేదన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి రూ. 3.35 లక్షల కోట్ల పన్నులను వసూలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. వసూలు చేసిన పన్నునంతా రాష్ట్రాలకు పంచకుండా వంచన చేస్తోందన్నారు. రోడ్ల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం లీటర్​పై రూపాయి సెస్ మాత్రమే అమలు చేస్తుందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో జగన్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందన్న సజ్జల..జ్యుడీషియరి రివ్యూకు వెళ్లొచ్చాకే సెకీ నుంచి యూనిట్ 2.49 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సౌర విద్యుత్ కొనుగోలులో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని..,ఇప్పడు డబ్బు సేవ్ చేసే పని చేస్తుంటే తప్పులు లేకున్నా వెతుకుతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details