తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2700 పైగా స్థానాల్లో ఎన్నికలు జరిగితే 2637 వైకాపాకు వచ్చాయన్నారు. తెదేపాకు 508, ఇతరులు 98 చోట్ల గెలిచారని వెల్లడించారు. కొందరు ఓటమిని కూడా ఉత్సాహంగా జరుపుకోవడం వింతగా అనిపిస్తోందని సజ్జల ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలోనూ మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
81 శాతానికి పైగా వైకాపా మద్దతుదారులే గెలిచారు: సజ్జల - ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు న్యూస్
తాము అనుకున్నట్లే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల వల్లే అనుకూలంగా ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు 81 శాతం పైగా సర్పంచులు వైకాపా మద్దతు దారులు గెలిచారని తెలిపారు.
81 శాతానికి పైగా వైకాపా మద్దతుదారులే గెలి81 శాతానికి పైగా వైకాపా మద్దతుదారులే గెలిచారు: సజ్జలచారు: సజ్జల
ఇవాళ సాయంత్రానికి గెలుపొందిన అభ్యర్థుల ఫొటోలతో సహా వెబ్ సైట్లో పెడతాం.. వీలైతే నిరూపించండని సజ్జల స్పష్టం చేశారు. మేం పెట్టిన ఫలితాల్లో తప్పులున్నట్లు చూపిస్తే సరిచేసుకుంటామని వ్యాఖ్యానించారు. వచ్చే దశల్లో తమకు ఫలితాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమిని హూందాగా ఒప్పుకోవాలన్నారు.
ఇదీ చదవండి:వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి