ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగుల సమస్యలను త్వరలోనే సీఎం పరిష్కరిస్తారు: సజ్జల - ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో ఏపీఎన్జీవో వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... ఉద్యోగుల సేవలను ప్రశంసించారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

By

Published : Nov 24, 2020, 7:29 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యలను సీఎం జగన్ సత్వరమే సానుకూలంగా పరిష్కరిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనాతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఉద్యోగుల హామీలు పరిష్కరించలేక పోతున్నామని తెలిపారు. ఏపీఎన్జీవో వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... సమస్యలు రాకపోతే ఉద్యోగుల డిమాండ్లన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యేవన్నారు.

ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్న సజ్జల... ఉద్యోగుల సహకారంతోనే సంక్షేమ పథకాలు ఇంత వేగంగా పూర్తి చేయడం సాధ్యపడిందన్నారు. ఏడాదిన్నర కాలంలో సహృదయంతో పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details