ముఖ్యమంత్రి జగన్‌పై తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు (TS ministers comments on jagan) వారి విచక్షణకే వదిలేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) అన్నారు. బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Ts minister prashanth reddy) వ్యాఖ్యానించటం సరికాదన్నారు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే (KCR) అన్నారని.., ఆయన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదేమోనని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్ధతి అవలంబిస్తుందని.. హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేం కదా అని అన్నారు. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ? అన్న సజ్జల..కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో తెదేపా నేతల్లాగే..తెరాస నేతలు మాట్లాడుతున్నారన్నారు.
"తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నాం. బిచ్చమెత్తుకుంటున్నామని అనడం సరికాదు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆరే అన్నారు. కేసీఆర్ మాటలు ఆయన మంత్రులు వినలేదేమో !.హక్కు ఉందని రోజూ చొక్కాపట్టి నిలదీయలేం. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతి. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు ?. కేసీఆర్ మెప్పు కోసం కొందరు మంత్రుల ప్రయత్నం" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
3 రాజధానులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం
ఈనెల 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోన్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొంటారని సజ్జల స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం పెండింగ్ అంశాలపై సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు. 3 రాజధానులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. రైతులకు మరో 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జగన్‌పై తెలంగాణ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ ప్రజలు, సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమొత్తుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలు అడుక్కు తింటారని అప్పట్లో ఏపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలోనే సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని నిజామాబాద్ జిల్లాలో తెరాస నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (ts minister Prasanth reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
"కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి" -ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రి