ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల - నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా వార్తలు

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిధి దాటి ప్రవర్తించడంతోనే..తాము తిరిగి ఆయనను ప్రశ్నిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అలా ప్రశ్నించడం రమేశ్‌కుమార్‌కు నచ్చడం లేదన్న సజ్జల.. తమను తప్పించాలని లేని అధికారాలను వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారు
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారు

By

Published : Jan 29, 2021, 4:05 PM IST

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిధి దాటి ప్రవర్తించడంతోనే.. తాము తిరిగి ఆయనను ప్రశ్నిస్తున్నామన్నారు. అలా ప్రశ్నించడం రమేశ్‌కుమార్‌కు నచ్చడంలేదన్న సజ్జల.. తమను తప్పించాలని లేని అధికారాలను వినియోగిస్తున్నారని మండిపడ్డారు.

ఎస్‌ఈసీ తన పరిధి దాటి ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి అభ్యంతరకరం, ఆక్షేపణీయం. చంద్రబాబు తరఫున ఏజెంట్‌గా నిమ్మగడ్డ వ్యవహరించారు. 2018లో జరగాల్సిన ఎన్నికలు 2020 వరకు ఎందుకు జరపలేదు..? ఎన్నికలను మేమెప్పుడూ వ్యతిరేకించలేదు, వాటికి సదా సిద్ధం. నేను ఎక్కడ కూర్చుని మాట్లాడాలో నిర్దేశించే హక్కు ఎస్‌ఈసీకి లేదు. ఎస్‌ఈసీ స్థానంలో కూర్చుని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. -సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వసలహాదారు

వంద గజాల్లో 3 లక్షలతో ఇళ్లు కడతామని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. గ్రామపంచాయతీ ఇంటిస్థలం కేటాయించి ఇళ్లు కట్టించగలదా..? అని ప్రశ్నించారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నియంతలా వ్యవహరిస్తున్నారు

ఇదీచదవండి

ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్​కు ఎస్‌ఈసీ లేఖ

ABOUT THE AUTHOR

...view details