ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రంగులు మార్చడానికి మేం అంత ఖర్చు చేయలేదు: సజ్జల - రంగులు మార్చడానికి మేం అంత ఖర్చు చేయలేదు

పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చటానికి కేవలం 30 లేదా 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. 1300 కోట్లు ఖర్చు చేసినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రంగుల విషయంలో మేము తప్పు చేస్తే ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారన్నారు.

రంగులు మార్చడానికి మేం అంత ఖర్చు చేయలేదు
రంగులు మార్చడానికి మేం అంత ఖర్చు చేయలేదు

By

Published : Jul 2, 2020, 8:31 PM IST

పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చడానికి 1300 కోట్లు ఖర్చు పెట్టారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. రంగుల మార్చటం కోసం 30 లేదా 35 కోట్లు ఖర్చు పెట్టి ఉంటామన్నారు. ఆర్టీఏ ద్వారా కూడా ఎవరైనా వివరాలు తీసుకోవచ్చని అన్నారు. గతంలో అన్న క్యాంటీన్ల నుంచి సులభ్ కాంప్లెక్స్​ల వరకు పసుపు రంగు వేశారని.. రంగులు వేయటం లాంటి చిల్లర అంశాలపై గతంలో మేము కోర్టులకు పోలేదన్నారు. పంచాయతీ కార్యాలయాలకు తాము వైకాపా రంగులు వేయక పోయినా.. న్యాయ స్థానం ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు తెలిపారు.

రంగుల విషయంలో మేము తప్పు చేస్తే ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారన్నారు. అధునాతన సౌకర్యాలతో అంబులెన్సులు ప్రారంభిస్తే.. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో 108 ,104 వ్యవస్థలు మూలనపడ్డాయని...అంబులెన్స్​లు ఎక్కడ తిరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు బీసీలకూ సంబంధం ఏముందన్నారు. ప్రపంచంలో లేని వ్యాధితో అచ్చెన్నాయుడు బాధ పడుతున్నట్లు చెబుతూ... తెదేపా అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చదవండి: 'నిర్లక్ష్యం.. అవినీతి మయం.. కక్షపూరితం.. వెరసి వైకాపా పాలన'

ABOUT THE AUTHOR

...view details