ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భవిష్యత్తులోనూ దాడులు చేసి మాపై రుద్దేందుకు తెదేపా కుట్ర: సజ్జల

By

Published : Feb 2, 2021, 7:43 PM IST

రాష్ట్రంలో వీలైనంత వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనికోసం ప్రభుత్వం పారితోషికాలను కూడా పెంచిందన్నారు. ప్రలోభాలకు తావులేకుండా, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికలు జరగాలని ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు.

sajjala comments on chandrababu naidu over attack on pattabhi
sajjala comments on chandrababu naidu over attack on pattabhi

నిమ్మాడలో నామినేషన్ వేయకుండా అచ్చెన్న దౌర్జన్యం చేశారని సజ్జల ఆరోపించారు. అచ్చెన్నను వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారన్నారు. పట్టాభిపై ఎవరు దాడి చేశారో దర్యాప్తులో తెలుస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబే దాడి చేయించి డ్రామా ఆడుతున్నారని అనుమానంగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. అచ్చెన్న అరెస్టు నుంచి దృష్టి మళ్లించేందుకే పట్టాభి ఎపిసోడ్‌ అని విమర్శించారు. భవిష్యత్తులోనూ తెదేపా దాడులు చేసి మాపై రుద్దేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ యాప్‌ వాడమంటే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఒప్పుకోలేదని.. సజ్జల అన్నారు. ఎస్‌ఈసీ సొంత యాప్ తయారీని వైకాపా వ్యతిరేకిస్తోందని.. ఎస్‌ఈసీ తయారుచేసిన సొంత యాప్‌పై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details