ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో రెండు లక్షల కోట్ల స్కామ్'

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం సంవత్సరం క్రితమే చీకటి ఒప్పందం కుదిరిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ప్రైవేటీకరణలో రెండు లక్షల కోట్ల స్కామ్ రూపొందించారని విమర్శించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో రెండు లక్షల కోట్ల స్కామ్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో రెండు లక్షల కోట్ల స్కామ్

By

Published : Feb 16, 2021, 7:03 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో రెండు లక్షల కోట్ల స్కామ్ రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం సంవత్సరం క్రితమే చీకటి ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కోతో సంప్రదింపులు నిజం కాదా? అని సీఎం జగన్​ను ప్రశ్నించారు. అధికార పార్టీ ఎంపీలు చేతకాని వాళ్ళుగా మిగిలిపోయారని..,లేఖల పేరుతో ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.

విశాఖ ఉక్కు ఉద్యమం నీరుగార్చేందుకే మున్సిపల్ ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చారన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతుందని శైలజానాథ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details