కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్రస్టులపై ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించటం కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌ల్లో మనీ లాండరింగ్, ఇతర చట్ట ఉల్లంఘనల పేరుతో దర్యాప్తుకు ఆదేశించినా.. కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. పీఎం కేర్స్ నిధి, ఆర్ఎస్ఎస్ సంస్థలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరని శైలజానాథ్ ప్రశ్నించారు.
'కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ పార్టీ ట్రస్టులపై దర్యాప్తులు' - కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ పార్టీ ట్రస్టులపై ప్రభుత్వ దర్యాప్తులు
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్రస్టులపై ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. కరోనా వల్ల విద్యాసంవత్సరం కుదించారని, అందువల్ల ఈ ఏడాది 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో కుట్ర దాగి వుందన్నారు.
కరోనా వల్ల విద్యాసంవత్సరం కుదించారని... అందువల్ల ఈ ఏడాది 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో కుట్ర దాగివుందన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య హక్కులు, జాతీయవాదం, పౌరసత్వం వంటి పాఠ్యాంశాలు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ తొలగించిందన్నారు. ఈ పాఠ్యాంశాలు తగ్గించడం వెనుక ఆర్ఎస్ఎస్ భావజాలం పెంపొందించే కుట్ర దాగుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సిలబస్ కుట్రను మేధావులు, సామాజిక వేత్తలు ఖండించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.