రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు కు చెందిన ఓం ప్రతాప్ అనే వ్యక్తి.. వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా అని శైలజానాథ్ ప్రశ్నించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే... అనేక వివాదాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఓటేసిన వారినే కాటేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.