కరోనా వైరస్, దళితులపై దాడులు, రాజధాని సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు సీఎం జగన్, మంత్రులు.. కోర్టులు, కేసుల పేరుతో ఎదురుదాడి చేస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, ధ్వంసాలు జరుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎదురుదాడి చేస్తున్నారన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఓటింగ్లో భాజాపాకు మద్దతు పలికిన జగన్.. ఏపీలో తెదేపా, భాజపా, జనసేన సంయుక్తంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. ప్రజల ముందు తాము వేరు అని ప్రకటనలు ఇస్తూ రెండు పార్టీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజలను పక్కదారి పట్టించేందుకే కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు' - జగన్పై శైలజానాథ్ కామెంట్స్
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే క్రమంలో ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

sailajanath comments on jagan govt