ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: శైలజానాథ్

By

Published : Aug 25, 2020, 11:01 PM IST

కాంగ్రెస్‌ నేత గంగాధర్​పై కేసు పెట్టడాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ తప్పుబట్టారు. కరోనా నియంత్రణపై ఒక డాక్టర్‌గా గంగాధర్‌ చేసిన నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించలేని ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు.

sailajanath comments on jagan govt
sailajanath comments on jagan govt

రాష్ట్ర ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యని శైలజానాథ్ దుయ్యబట్టారు. గతంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూను చట్టవ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ కేసు పెట్టడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా? అన్న అనుమానం కలుగుతుందన్నారు. గంగాధర్​కు సీఐడీ నోటీసులివ్వడం దారుణమన్నారు. గంగాధర్ పై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details