అవగాహన లేకుండా.. వ్యక్తిగత అజెండాతో వైకాపా పరిపాలిస్తోందని... పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడిగా విజయవాడలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీ ప్రమాణం చేశారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలను కాపాడే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసిందని చెప్పారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు అండగా ఉంటామని జగన్ చెప్పే మాటలు వాస్తవమే అయితే... సీఏఏ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.మండలి రద్దు ప్రతిపాదన సమయంలో వైఎస్ గుర్తుకురాలేదా..? అని శైలజానాథ్ ప్రశ్నించారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తామనిశైలజానాథ్ స్పష్టం చేశారు.
'మండలి రద్దు ప్రతిపాదన వేళ... వైఎస్ గుర్తుకురాలేదా..?'
పీసీసీ అధ్యక్షుడిగా మాజీమంత్రి సాకే శైలజానాథ్ ప్రమాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ... వైకాపా సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు.
sailajanath comments on cm jagan