అపార్ట్మెంట్ సంస్కృతిలో కరోనా కట్టడి సవాలుగా మారింది. పట్టణాల్లో ఎక్కువ శాతం జనాభా అపార్ట్మెంట్లలో ఉంటున్నందున.. అక్కడా తగు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే అపార్ట్మెంట్ వాసులు స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు బయటవారిని పూర్తిగా నియంత్రిస్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్యాండ్ రైలింగ్ సాయం తీసుకోకపోవటం... లిఫ్ట్‌లో బటన్లు నొక్కటానికి గ్లౌజులు ధరించటం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అపార్ట్మెంట్లో ఉంటున్నారా... అయితే జాగ్రత్త - కరోనాపై అపార్ట్మెంట్లలో జాగ్రత్తలు
కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు లాక్డౌన్ పాటించటం ఎంత ముఖ్యమో... స్వీయ నియంత్రణ అంతే ముఖ్యం. పట్టణాల్లో ఎక్కువ శాతం అపార్ట్మెంట్లో జన జీవనం ఉంటున్నందున.. అక్కడా తగు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. అందుకనుగుణంగా అనేక చోట్ల ప్రజలూ తగు నియమాలు పాటిస్తున్నారు.
అపార్ట్మెంట్లో కరోనా జాగ్రత్తలు
పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలను నిషేధించారు. భౌతిక దూరం పాటించటంతో పాటు స్వీయ నియంత్రణ ద్వారా కరోనా అరికట్టగల అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ వెతలు: 8 నెలల గర్భిణి- 200కి.మీ నడక