తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె అందింది. తితిదే అర్చకులు.. అమ్మవారికి సారెను సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. నవమి రోజున అమ్మవారికి తితిదే నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తరపున అమ్మవారికి తితిదే అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నుంచి.. కనకదుర్గ అమ్మవారికి సారె - కనకదుర్గ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నుంచి.. కనకదుర్గ అమ్మవారికి సారె అందింది. తితిదే అర్చకులు అమ్మవారికి సారెను సమర్పించారు.
సారె
భవానీల మాల విరమణ గురించి మాట్లాడిన దుర్గగుడి ఛైర్మన్.. ఇరుముడి స్వగ్రామాల్లోని ఆలయాల్లోనే సమర్పించాలని ఆయన కోరారు. కరోనా దృష్ట్యా ఈ సారి భవానీలకు దర్శనం, కేశఖండన, జల్లు స్నానాల ఏర్పాట్లు మాత్రమే చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:విజయవాడ కనకదుర్గమ్మకు.. కనక మహాలక్ష్మీ అమ్మవారి సారె