శ్రీశైలం ఎగువన కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘం డిమాండ్ చేసింది. ఆ ప్రాజెక్టులు పూర్తయితే నాగార్జున సాగర్ దిగువ భాగంలో 30 లక్షల ఎకరాలకు నీరు అందని పరిస్థితి నెలకొంటుందని సంఘ సభ్యులు ఆరోపించారు. రేపు జరగబోయే కేఆర్ఎంబీ(KRMB) సమావేశంలో ఏపీ తరఫున ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలన్నారు.
"అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులను చేపడుతోంది. అవి పూర్తయితే నాగార్జున సాగర్ కింద ఉన్న దాదాపు 30 లక్షల ఎకరాల బీడు భూములుగా మారుతాయి. రేపు జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో, కేంద్ర గెజిట్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ వాదనలు వినిపించాలి. శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకట్ట వేసి, ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి." -ఆళ్ళ వెంకట గోపాల కృష్ణ, ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు
KRMBకి లేఖ