కార్తీక మాసంలో బెజవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఉచిత దర్శనం క్యూలైన్లో భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాలధారణ కోసం భవానీలు కొండకు ఎక్కువగా తరలి వస్తున్నారు. భవానీ దీక్షదారుల దృష్ట్యా అమ్మవారి అంతరాలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శనివారం అయినందున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం నివేదన సమయంలో దర్శనాన్ని నిలివేశారు. దీంతో భక్తులు క్యూలైన్లోనే వేచి ఉన్నారు.
కార్తీకమాసం.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. భవానీ దీక్షదారులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
భక్తులతో పోటెత్తిన కనకదుర్గ ఆలయం