ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Extension: పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలన మరో ఆరు నెలల పొడగింపు - special officers in the parishes was extended

మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిషత్ ఎన్నికలు ముగిసినా..లెక్కింపుపై హైకోర్టులో విచారణ ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ప్రత్యేక అధికారుల పాలన
ప్రత్యేక అధికారుల పాలన

By

Published : Jul 2, 2021, 7:45 PM IST

మండల, జిల్లా పరిషత్​లలో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 4 తేదీతో ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే ప్రత్యేకాధికారుల పాలన ముగుస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికలు ముగిసినా..లెక్కింపుపై హైకోర్టులో విచారణ ఉండటంతో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details