ఆర్టీసీ ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. నష్టాల సాకుతో బస్సు ఛార్జీలను పల్లెవెలుగుకు కిలోమీటర్‌కు 10 పైసలు, ఇతర సర్వీసులకు 20 పైసలు పెంచటం సరికాదని ఓ ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజారవాణా వ్యవస్థను లాభనష్టాలతో బేరీజు వేయడం సరికాదని హితవుపలికారు. ఇప్పటికే ఉల్లి ధర ఎన్నడూ లేనంతగా 150 రూపాయలకు చేరిందని... నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై భారం మోపబోమన్న జగన్ సర్కారుకు ఇలా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే చెడ్డపేరు రావడం ఖాయమన్నారు.
'ఆర్టీసీ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఆర్టీసీ ఛార్జీల పెంపు సరికాదని... జగన్ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ