ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత తలెత్తిన కార్మికుల సమస్యలపై చర్చించేందుకు విజయవాడలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. కార్మికుల పదోన్నతి, పింఛను, వైద్యం తదితర అంశాలపై చర్చించారు. ఆర్టీసీ విలీన అనంతరం నష్టాలే ఎక్కువగా ఉన్నాయని యూనియన్ నాయకులు చెబుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఉన్న అంశాల పరిష్కరానికి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై కార్మికులతో చర్చించి నిర్ణయించే ఆలోచనలో ఉన్నారు. సమావేశానికి ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఇతర సంఘాల నేతలు హాజరుయ్యారు.