కొవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. 2020 జనవరి తర్వాత కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలిచ్చారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోపు కారుణ్య నియామల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఎండీ సూచించారు. బాధిత కుటుంబాలకు అర్హతలు, ఆసక్తిని బట్టి కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేయాలని తెలిపారు. కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామిక్ ఉద్యోగాలను జిల్లాల్లోని రీజినల్ మేనేజర్లు నియామక ప్రక్రియ చేపట్టాలని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను జోనల్ ఈడీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని తెలిపారు.