ఇరు రాష్ట్రాల సర్వీసులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయనే అంశంపై హైదరాబాద్ బస్ భవన్లో అధికారులు చర్చించారు. టీఎస్ ఆర్టీసీ బస్సులు ఏపీలో లక్షా 50వేల కి.మీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 2లక్షల 61వేల కి.మీ. తిరుగుతున్నాయి. ఏపీలో తిరిగే టీఎస్ ఆర్టీసీ బస్సుల కంటే... తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు లక్షా 11వేల కి.మీ.లు అదనంగా తిరుగుతున్నాయి. కాబట్టి.. అదనపు కి.మీ తగ్గించుకోవాలని ఏపీ అధికారులకు టీఎస్ ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
అసంపూర్తిగానే ముగిసిన 'ఆర్టీసీ' సమావేశం.. త్వరలోనే మళ్లీ భేటీ! - rtc officiats meeting
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పంద సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బస్ భవన్లో భేటీ అయ్యారు.
అసంపూర్తిగానే ముగిసిన 'ఆర్టీసీ' సమావేశం.. త్వరలోనే మళ్లీ భేటీ!
మరో నాలుగైదు రోజుల్లో తిరిగి సమావేశం అవుదామని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీ అధికారుల ముందు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిపాదన చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు
Last Updated : Aug 24, 2020, 8:30 PM IST