ఆర్టీసీ ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం - ఆర్టీసీ ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజేషన్ తాజా వార్తలు
19:38 December 28
ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరులోగా సిబ్బంది వివరాలు పంపాలని ఆర్‌ఎంలకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31 నాటికి 240 రోజులు పూర్తయినవారి వివరాలు పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ఒప్పంద సిబ్బందిని క్రమబద్ధీకరించాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు ఎండీ కృష్ణబాబు స్పష్టం చేసారు. ప్రభుత్వ నిర్ణయంపై ఈయూ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి