విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో సంస్థ ఛైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. సభ్యులతో పాటు ఎండీసురేంద్రబాబు, పలు విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. కార్మికులు, ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగించేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఉద్యోగులు, కార్మికులకు ఇకపై పింఛను, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. వైద్య ఖర్చులు మంజూరు చేసే అధికారం సంస్థ ఎండీకి బదలాయించారు.
ఆర్టీసీ పాలకమండలి భేటీ - varla ramaiah
విజయవాడలోని ఆర్టీసీ భవనంలో ఛైర్మన్ వర్ల రామయ్య అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగించేలా పలు నిర్ణయాలు తీసుకుంది.
ఆర్టీసీ పాలకమండలి భేటీ
శ్రీకాకుళం, మచిలీపట్నం, చిత్తూరు జిల్లాలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా ఇంటి అద్దె చెల్లించాలని మండలి నిర్ణయించింది. అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని సభ్యులు ఏకగ్రీన తీర్మానంచేశారు. 2018 -19 ఆర్థిక సంవత్సరానికి గాను681 నాన్ ఎసీ, 80 ఎసీ బస్సుల బాడీ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది.