ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

APSRTC MD: సంక్రాంతి ప్రత్యేక బస్సులకు 50 శాతం టికెట్ ధర పెంపు: ఆర్టీసీ ఎండీ - AP LATEST NEWS

ఆర్టీసీ ఎండీ
ఆర్టీసీ ఎండీ

By

Published : Jan 6, 2022, 12:39 PM IST

Updated : Jan 6, 2022, 3:20 PM IST

12:35 January 06

ప్రత్యేక సర్వీసులకు 50 శాతం టికెట్ ధర పెంచుతున్నాం: ఆర్టీసీ ఎండీ

APSRTC MD ON SANKRANTHI SPECIAL BUSES: సంక్రాంతి పండగ దృష్ట్యా ఈ నెల 7 నుంచి 18 వరకు 6,900 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఈ సర్వీసులపై.. 50 శాతం అదనంగా టికెట్‌ రేట్లు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

రోజుకు సరాసరిగా 470 ప్రత్యేక బస్సులు తిరుగుతాయన్న ఆయన.. 9వేల సర్వీస్ నెంబర్ ఉన్న బస్సులన్నీ ప్రత్యేక సర్వీసులుగా గుర్తించాలన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు చెప్పారు.

డీజిల్ రేట్లు 60 శాతం పెరిగినందునే.. ప్రత్యేక సర్వీసులకు 50 శాతం టిక్కెట్ ధర పెంచుతున్నట్లు చెప్పారు. తమ రేట్లు సహేతుకంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. టికెట్ ధరల విషయంలో ఇతర రాష్ట్రాలతో తమకు పోటీ లేదని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.

డీజీల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చే ప్రణాళిక ఉందన్న ఆయన.. ఈ బస్సుల ట్రయల్ రన్ ఫిబ్రవరిలో ఉంటుందని తెలిపారు. తిరుమలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై వచ్చిన నివేదిక ప్రస్తుతం పరిశీలనలో ఉందని చెప్పారు. ఆర్టీసీ భూములను అద్దెకు ఇస్తున్నామని.. ఇది నిరంతరం జరిగే ప్రక్రియేనని తిరుమల రావు చెప్పారు.

ఇదీ చదవండి:

సుప్రీంకు 'మోదీ పర్యటన' వ్యవహారం- విచారణకు పంజాబ్​ సర్కార్ కమిటీ!​

Last Updated : Jan 6, 2022, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details