బస్స్టాండ్లలోని దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని.. దుకాణదారులను.. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ హెచ్చరించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరైవల్, డిపార్చర్, సిటీ బస్ టెర్మినల్ చూశారు. మొదటి అంతస్తులో ఉన్న డార్మెటరీలను పరిశీలించారు. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అక్కడే ఉన్న క్యాంటీన్‌ను, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. అనంతరం సిటీ పోర్ట్‌కు వెళ్లి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్గో, కొరియర్ కౌంటరు, డెలివరీ పాయింట్లను పరిశీలించారు. ఎరైవల్ బ్లాక్‌లో ఉన్న మినీ థియేటర్‌ను తిరిగి తెరిచేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. బస్టాండులో ఖాళీగా ఉన్న దుకాణాలను త్వరగా నింపాలని, ఆదాయం వచ్చే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సజ్జలతో ఠాకూర్ భేటీ