ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఆర్సీ అంశంపై ఆర్టీసీ ఆందోళన బాట.. రేపు యాజమాన్యానికి మోమోరాండం - పీఆర్సీ అంశంపై ఆర్టీసీ ఆందోళన బాట న్యూస్

పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వల్ల తమకు నష్టం జరుగుతోందని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించుకునేందుకు ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ జీవోల్లో ఇబ్బందులు తొలగించాలంటూ రేపు ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వనున్నారు.

పీఆర్సీ అంశంపై ఆర్టీసీ ఆందోళన బాట
పీఆర్సీ అంశంపై ఆర్టీసీ ఆందోళన బాట

By

Published : Jun 8, 2022, 10:23 PM IST

పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల వల్ల తమకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఆర్టీసీ కార్మికులు.. వాటిని పరిష్కరించుకునేందుకు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. పీఆర్సీ జీవోల్లో ఇబ్బందులు తొలగించాలంటూ గురువారం ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వనున్నారు. గురువారం భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించనున్నట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నేతలు తెలిపారు. విజయవాడలోని రెవెన్యూ భవన్​లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీ జీవోల వల్ల జరుగుతోన్న నష్టాలపై చర్చించారు. ఎంప్లాయిస్ యానియన్, ఎన్​ఎంయూ, ఎస్​డబ్ల్యూఎఫ్ సహా పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.

పీఆర్సీ జీవోల వల్ల ఆర్టీసీ కార్మికులకు లబ్ది జరగకపోగా నష్టం జరుగుతోందని నేతలు వ్యాఖ్యనించారు. ప్రభుత్వంలో విలీనం వల్ల ఇప్పటికే పలు రకాల బెనిఫిట్స్​ను ఆర్టీసీ కార్మికులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో అపరిమిత ఉచిత వైద్యాన్ని కోల్పోగా.. ఈహెచ్​ఎస్ కార్డుతో ఇబ్బందులు పడుతున్నట్లు యాజమాన్యానికి ఇప్పటికే తెలిపారు. పీఆర్సీ జీవోలతో ఉద్యోగుల వేతనాలు ఆశించిన రీతిలో పెరగకపోగా.. నష్టం జరుగుతున్న దృష్ట్యా వీటిని సరిదిద్దాలని కోరనున్నారు. రేపు మరోసారి జేఏసీ నేతలు సమావేశమై పీఆర్సీ జీవోలపై ఉన్న ఇబ్బందులపై చర్చించాలని నిర్ణయించారు. రేపు ప్రభుత్వానికి లేఖలు ఇచ్చాక జెఏసీ భవిష్యత్ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details