ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC EU LETTER: సమస్యలను సత్వరం పరిష్కరిచండి: ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్

ఆర్టీసీ విలీనం తరువాత అపరిష్కుతంగా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరిచాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి(PERNI NANI) లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా సర్వీస్ రూల్స్, పీఆర్సీ (PRC), పాత పెన్షన్ల(PENSION)తో పాటు ఇతర విషయాలపై సానుకూలంగా స్పందించాలని కోరింది.

rtc employees union letter to transport minister perni nani
సమస్యలను సత్వరం పరిష్కరిచండి

By

Published : Jun 30, 2021, 2:17 AM IST

ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ(RTC) ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారని.. వారి సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు దామోదర్, వైవీ రావు లేఖ రాశారు. సర్వీస్ రూల్స్, పీఆర్సీ (PRC), పాత పెన్షన్ల(PENSION) విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2020 జులైలోగా చెల్లిస్తామన్నపీఆర్సీ (PRC)బకాయిలు వెంటనే చెల్లించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని వారికి ఇచ్చిన సర్వీసు రూల్స్‌లో అన్యాయం జరిగిందని.. దానిని తక్షణం సరి చేయాలని సూచించారు. ఆర్టీసీలో 1989 నుంచి ఉన్న ఎస్సార్బీఎస్​ (SRBS),ఎస్బీటీ (SBT)ని రద్దు చేశారని.. వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. లేదంటే ఆ ట్రస్టుల్లో జమచేసిన డబ్బును వడ్డీతోసహా ఉద్యోగులకు చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలోని కాంట్రాక్టు కండక్టర్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరారు. 2017 నుంచి 2021 వరకు పెండింగ్​లో ఉన్న లీవ్ ఎన్ క్యాష్ మెంట్(LEAVE ENCASHMENT) ను వెంటనే చెల్లించాలని విన్నవించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటోన్న పలు సమస్యలను సత్వరం పరిష్కరించాలని మంత్రిని ఈయూ నేతలు లేఖ ద్యారా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details